ధోనీపై సినిమా ఫస్ట్ లుక్ విడుదల
బాలీవుడ్ లో క్రీడాకారుల జీవితాల ఆధారంగా మరో సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఫర్హాన్ అఖ్తర్ 'భాగ్ మిల్కా భాగ్'... ప్రియాంకా చోప్రా 'మేరీ కోమ్' ప్రేక్షకులను రంజింపజేశాయి. ఈ కోవలోనే సుషాంత్ రాజ్ పుత్ ప్రధానపాత్రలో 'ఎం.ఎస్.ధోనీ... ద అన్ టోల్డ్ స్టోరీ' సినిమా రూపుదిద్దుకుంటోంది. సుషాంత్ ఇందులో ధోనీ పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను నేడు విడుదల చేశారు. ఆ పోస్టర్లో సుషాంత్... ధోనికి అచ్చొచ్చిన ఏడో నెంబర్ జెర్సీ ధరించి, బ్యాట్ భుజంపై పెట్టుకుని కనిపిస్తాడు. ఈ సినిమాకు నీరజ్ పాండే దర్శకుడు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిపై ధోనీ అర్ధాంగి సాక్షి ట్విట్టర్లో స్పందించింది. ఈ సినిమా విషయంలో ఇప్పటివరకు వచ్చిన ఊహాగానాలన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలతో పటాపంచలయ్యాయని పేర్కొంది.